NTV Telugu Site icon

Actress Vardhini: నటి శాడిజం.. ప్రియుడు ఆత్మహత్య!!

Vardhini Yallarematts

Vardhini Yallarematts

Actress Vardhini Yallarematts 25 Year Old Live In Partner Dies: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వేధింపులు తట్టుకోలేక నటి ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటి వర్ధిని యల్లారెమట్ తన 25 ఏళ్ల ప్రియుడిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందిన సమాచారం మేరకు పోలీసులు నటిని అదుపులోకి తీసుకున్నారు. వర్ధిని యల్లారెమట్‌గా ప్రసిద్ధి చెందిన నటి వీణ ప్రియుడు అక్టోబర్ 1న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఆత్మహత్యకు నటి ప్రియుడి ఆ నటే కారణం అని కుటుంబం ఆరోపించింది. పెళ్లి కోసం నిత్యం ఒత్తిడి తెస్తున్న నటి ఒత్తిడి మేరకే ఈ చర్య తీసుకున్నట్టు ప్రియుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

Samantha: కొండాసురేఖ ఆరోపణలు.. అమ్మవారి సేవలో సమంత

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తున్న మదన్ గత ఏడాది కాలంగా వీణతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని తెలుస్తోంది. అయితే మదన్ ఈ సమయంలో పెళ్లి చేసుకోవాలనుకోలేదు. అందుకే వీణతో పెళ్లికి మదన్ నిరాకరించాడు. అయితే వీణ మాత్రం అతడిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. వీణ మదన్ ఇంటికి కూడా వెళ్లి పెళ్లి టాపిక్ లేవనెత్తింది, మదన్ ఇంటికి వెళ్లి గొడవ చేసింది. ఆమె మదన్ కు హాని కలిగించేందుకు ప్రయత్నించినట్లు కూడా తెలిసింది. ఇక ఇప్పుడు మదన్ ఆత్మహత్య తర్వాత, పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించారని కేసు నమోదు చేశారు. అలాగే ఘటనా స్థలం నుంచి పోలీసులు కొంత సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments