NTV Telugu Site icon

Pranitha Subhash: : మళ్ళీ తల్లవుతున్నా.. ఇక అవి కష్టమే.. హీరోయిన్ ఆసక్తికర పోస్ట్

Praneetha Subhash Pregnancy

Praneetha Subhash Pregnancy

Actress Pranitha Subhash announced her pregnancy with her baby bump Photos: తెలుగు సహా కన్నడ తమిళ, హిందీ, మలయాళ సినిమాలు చేస్తూ వచ్చిన హీరోయిన్ ప్రణీత సుభాష్ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు మరో బిడ్డకు తల్లినవ్వుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిజానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రణీత సుభాష్ కేవలం కన్నడ సినిమాలు మాత్రమే కాదు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. గురువారం నాడు సోషల్ మీడియా వేదికగా తన బేబీ బంపు ఫోటోలు షేర్ చేస్తూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆమె వెల్లడించింది. బ్లాక్ టీ షర్ట్ ధరించిన ఆమె డెనిమ్ జీన్స్ ధరించి కనిపిస్తోంది.

Balakrishna: బాలయ్యా.. ఏందయ్యా ఈ జోరు.. కుర్ర హీరోలతో పోటీనా?

ఇక ఆమె పెట్టిన ఫోటోలకు క్యాప్షన్ గా రౌండ్ టు, ఈ పాంట్స్ ఇంకా ఫిట్ అవ్వడం కష్టమే అంటూ కామెంట్ చేసింది. నితిన్ రాజు అనే ఒక బిజినెస్ మాన్ ని ఆమె 2021 మే నెలలో వివాహం చేసుకుంది. 2022 జూన్ లో ఆమె ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే ఆమె ఇటీవలే కన్నడ రమణ అవతార అనే సినిమాలో కనిపించింది. వికాస్ -వినయ్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో రిషి, శుభ్ర అయ్యప్ప, అరుణ్ సాగర్, అనిరుద్ ఆచార్య వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. 2010లో కన్నడ సినిమా పోర్కితో హీరోయిన్ గా మారిన ఆమె ఆ తర్వాత భీమా తీరదల్లి అనే సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో పనిచేసిన ఆమెకు ఇక్కడ మాత్రం ఆశించిన ఫలితం అయితే దక్కలేదనే చెప్పాలి.