Site icon NTV Telugu

Pia Bajpiee: సమంత లానే మయోసైటిస్ బారిన పడ్డ ‘రంగం’ బ్యూటీ.. ఇంట్లో ఎవరికి చెప్పకుండా

Sam

Sam

Pia Bajpiee: స్టార్ హీరోయిన్ల నిజ జీవితం ఎవరికి తెలియనిది.. వారి విలాసవంతమైన భవనాలు, విందు భోజనాలు, లగ్జరీ లైఫ్ మాత్రమే అందరు చూస్తారు. కాలం, వారి వెనుక విషాదాలు ఎన్నో.. ఇక ఈ మధ్య హీరోయిన్లు అరుదైన వ్యాధుల బారిన పడుతుండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మొన్నటికి మొన్న సమంత మయోసైటిస్ బారిన పడిన సంగతి తెల్సిందే. అరుదైన వ్యాధి కావడంతో దానికి చికిత్స లేదని, సామ్ పరిస్థితి రెండో స్టేజిలో ఉందని తెలుస్తోంది. ఈ వ్యాధి చికిత్స కోసం ఆమె సౌత్ కొరియా వెళ్లిన సంగతి తెల్సిందే. ఇక తాజాగా తాను కూడా మయోసైటిస్ బాధితురాలినే అని చెప్పుకొచ్చింది మరో హీరోయిన్. పియా బాజ్ పాయ్. రంగం సినిమాలో జీవా ప్రియురాలిగా నటించి మెప్పించిన పియా.. ఆ తరువాత పలు సినిమాల్లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాల్లో కనిపిస్తున్న ఆమె.. సమంత మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలుసుకొని స్పందించింది. అది ఎంత నరకమో చెప్పుకొచ్చింది.

“నేను కూడా మయోసైటిస్ బాధితురాలినే. చికిత్స లేని వ్యాధి అది. నాకు ఆ వ్యాధి ఉంది అనగానే ఇంట్లో ఎవరికి తెలియకుండా చికిత్స తీసుకోవడం మొదలుపెట్టాను. ప్రస్తుతం సమంత పడుతున్న బాధను అర్ధం చేసుకోగలను. ముంబైలో ఈ వ్యాధికి చికిత్స తీసుకున్నా.. ఈ వ్యాధిని జయించాలి అంటే మనోధైర్యం కావాలి. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను”అని చెప్పుకొచ్చింది. అయితే ఆమె పోరాడి బయటకు వచ్చింది కనుక సామ్ కూడా ఈ వ్యాధి నుంచి బయటపడుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version