మదురైకి చెందిన నివేదా పేతురాజ్ తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తోంది. సుమారు ఏడెనిమిదేళ్లుగా రంగుల ప్రపంచంలో ఎంతో బిజీబిజీగా గడిపిన నివేదా పేతురాజ్ ఇప్పుడు పెద్దగా సినిమాలు అయితే చేయడం లేదు. తాజాగా ఆమె కొద్దిరోజుల క్రితం చెన్నై ప్రధాన రహదారిపై ప్రయాణిస్తుండగా సిగ్నల్ వద్ద జరిగిన ఓ చేదు సంఘటన గురించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిన్న కుర్రాడు ఇలా చేయడం బాధాకరం అని ఆమె పేర్కొన్నారు. చెన్నైలోని అడయార్ సర్కిల్‌లో ప్రయాణిస్తున్నప్పుడు నివేత కారు సిగ్నల్ వద్ద ఆగింది. ఏడెనిమిదేళ్ల కుర్రాడు వచ్చి డబ్బులు అడిగేసరికి నివేత మొదట ఒప్పుకోలేదు. కానీ పుస్తకం చూపించి 100 రూపాయలకి ఇస్తానని చెప్పగా, చిన్న పిల్లాడు చాలా కష్టజీవి అని నివేత బాధ పడి 100 రూపాయలు పెట్టి పుస్తకం కొనుక్కుందాం అనుకుంది. అయితే అకస్మాత్తుగా చిన్న పిల్లవాడు 500 రూపాయలు అడిగాడు.
Pushpa The Rule: అంతా అనుకున్నట్టే అవుతోంది.. టెన్షన్ పడొద్దు ఆర్మీ!
నివేత తను ఇస్తున్న 100 రూపాయలు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది కాని చిన్న పిల్లవాడు పుస్తకాన్ని కారు కింద పడవేసి, చేతిలో ఉన్న 100 రూపాయలతో పారిపోయాడు. 100 రూపాయలు ముఖ్యం కాదు కానీ ఆ చిన్నారి ప్రవర్తన చాలా బాధాకరం అంటూ నివేత సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మరోపక్క 100 రూపాయలు ఇవ్వడానికి ఇంతగా ఆలోచించినందుకు నివేతపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీరు అతన్ని పట్టుకుని ఉండాల్సిందని, దీనికి మీరు మద్దతు ఇవ్వకూడదని మరికొందరు వ్యాఖ్యానించారు. ‘ఒరు నాల్ కూతు’ సినిమాతో సినీ జర్నీ ప్రారంభించిన నివేత టిక్ టిక్ టిక్, చిత్రలహరి, సంగతమిలన్, అలా వైకుంఠపురంలో, రెడ్, పాగల్, దస్ క దుమ్మీ, పార్టీ వంటి భారీ బడ్జెట్ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అలాగే తెలుగులో కూడా ఆమె అనేక మంది హీరోలతో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది.