NTV Telugu Site icon

ఓటీటీ యాప్ ను ప్రారంభించబోతున్న నమిత

తెలుగు, తమిళంలో నటించిన నమిత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సొంతం, జెమిని, బిల్లా, సింహ లాంటి తెలుగు చిత్రాలలో నటించింది. తనదైన బొద్దు అందాలతో మంచి ఫాలోయర్స్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. 2017లో వీరేంద్రతో ప్రేమవివాహం చేసుకుంది. కాగా, తాజాగా శనివారం ఉదయం నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ దేవస్థానంపై నమిత అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు టీటీడీ సంతృప్తికరమైన దర్శనం కల్పించడం లేదని అన్నారు. మరోవైపు తాను నటించిన ‘భౌభౌ’ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అలాగే నమిత థియేటర్ పేరుతో ఓటీటీ యాప్, నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నట్లు నమిత తెలిపింది.

Actress Namitha Visits Tirumala Tirupathi Temple || NTV Entertainment