Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..

Nani Meenakshi Chowdary

Nani Meenakshi Chowdary

‘సాహో’, ‘OG’ చిత్రాల దర్శకుడు సుజీత్ మరియు నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం బ్లడీరోమియో. నిహారిక ఎంటెర్టైమెంట్స్ తో నాని సొంత నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రొడక్షన్స్ పై నాని, వెంకట్ బోయినపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్టైలిష్ విజువల్స్, నాని సరికొత్త మేకోవర్‌తో రూపొందుతున్న ఈ సినిమా సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. 

ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్‌గా గ్లామరస్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటించనుందట. అలాగే మలయాళ వర్సటైల్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పృథ్వీరాజ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘బ్లడీ రోమియో’ చిత్ర షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించి, ఆ తర్వాత లండన్ వేదికగా ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. లండన్‌లో తీయబోయే సన్నివేశాలు ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. నాని ఒక సరికొత్త మేకోవర్‌తో ఈ సినిమాలో అలరించబోతున్నారు. డిఫరెంట్ యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.  అలాగే ఈ సినిమా కోసం ముగ్గురు సంగీత దర్శకులు పని చేయబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది.