తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల మంచు లక్ష్మి , సీనియర్ జర్నలిస్ట్ మధ్య సంభవించిన వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నిర్మించిన ‘దక్ష’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే, ఆ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ‘మీరు 50 ఏళ్లకు దగ్గరవుతున్నారు. 12 ఏళ్ల కూతురు ఉన్నా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అంటూ వ్యక్తిగతంగా, అవమానకరంగా ప్రశ్నలు అడగడం వల్ల మంచు లక్ష్మి తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు.
Also Read : Satyareddy : “టాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి ‘కింగ్ బుద్ధ’తో హాలీవుడ్ ఎంట్రీ
‘ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మీకు ధైర్యం ఉంది? ఇదే ప్రశ్న మహేశ్ బాబుని అడగగలరా? మహిళల పట్ల ఇది చులకనగా ఉంది. జర్నలిస్ట్ అయ్యి ఇలాంటి ప్రశ్నలు అడిగితే జనం ఏం నేర్చుకుంటారు?’ అని తెలిపారు. అంతటితో ఆగకుండా మంచు లక్ష్మి ఫిల్మ్ ఛాంబర్‌కి ఫిర్యాదు చేశారు. సీన్‌లలో బాడీ షేమింగ్, అవమానకరమైన ప్రశ్నలు వేసి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారని, జర్నలిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని’ కోరారు. అయితే తాజాగా ఈ విషయంపై నటి హేమ స్పందిస్తూ..
‘మీడియా వల్ల బాధపడే వారిలో నేను కూడా ఒకరిని. పెద్దగా చదువుకోని వారికి ఇండస్ట్రీ అర్థం కాకపోవచ్చు, కానీ చదువుకున్న, బాధ్యత ఉన్న జర్నలిస్టులు ఇలా మాట్లాడితే బాధాకరం. ఏది అడగాలి, ఏది అడగకూడదు అన్న విచక్షణ లేకపోతే ఎలా. ఇతర మహిళా జర్నలిస్టులు కూడా దీనిని ఖండించకపోవడం సిగ్గుచేటు’ అని తెలిపింది. అంతే కాదు.. ‘మొన్నటికి మొన్న యాంకర్ సుమ గురించి చిన్న వ్యాఖ్య చేస్తే ఆమెతో క్షమాపణలు చెప్పించారు. అలాంటి సందర్భాల్లో స్పందించిన జర్నలిస్టులు ఇప్పుడు మంచు లక్ష్మి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? లేడీ జర్నలిస్టులు సైతం దీన్ని ఖండించకపోవడం సిగ్గుచేటు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
