మలయాళ నటుడు, తెలుగులో ‘దసరా’ సహా పలు చిత్రాల్లో విలన్ తరహా పాత్రలు పోషించిన షైన్ టామ్ చాకో, ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో పడ్డాడు. మలయాళ నటి విన్సీ, కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను ఒక ఫిల్మ్ షూటింగ్ సందర్భంగా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఒక హీరో, డ్రగ్స్ తీసుకుంటూ తనను అతని ముందే బట్టలు మార్చుకోమని బలవంతం చేసినట్లు ఆమె ఆరోపించింది. నటీనటుల సంఘం ‘అమ్మ’కి షైన్ టామ్‌పై ఫిర్యాదు చేసింది. నిజానికి, గతంలోనే షైన్ పేరు అలుపూజ హైబ్రిడ్ డ్రగ్ కేసులో వినిపించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అతన్ని పిలిచి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని షైన్ తోసిపుచ్చినప్పటికీ, ఇప్పుడు ఏకంగా ఒక నటి ఫిర్యాదు చేయడంతో అతను ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.
Meenakshi Natarajan : కుంభమేళాలో కుల వివక్ష చూపించారు.
నిజానికి, మొదట ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, ఇప్పుడు ఏకంగా షైన్ పేరు ప్రస్తావించడంతో అతను చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. తాను షూటింగ్‌లో ఉన్నప్పుడు తన అడ్రస్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతుండగా, అతను నా వద్దకు వచ్చి గట్టిగా అరుస్తూ, “నన్ను చూడనివ్వు, నేను సెట్ చేస్తాను” అని బెదిరించాడని విన్సీ తెలిపింది. మరోసారి, నేను సీన్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా, అతను నోటి నుంచి ఒక తెల్లటి పౌడర్ ఉమ్మివేయడాన్ని గమనించానని, అతను డ్రగ్స్ తీసుకుంటున్న విషయం తనకు అర్థమైందని ఆమె పేర్కొంది. ఫిల్మ్ సెట్‌లో ఇలా డ్రగ్స్ తీసుకోవడం సరికాదని ఆమె అభిప్రాయపడింది. ఆమె ఈ విషయంపై చేసిన వీడియో వైరల్ కావడంతో, ‘అమ్మ’ సహా సినీ రంగానికి చెందిన పలు అసోసియేషన్లు ఈ విషయంపై ఫిర్యాదు చేయమని ఆమెను కోరాయి. దీంతో, ఆమె ఒక అడుగు ముందుకు వేసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
