NTV Telugu Site icon

Tiku Talsania: ప్రముఖ నటుడికి హార్ట్ ఎటాక్

Tiku Talsania News

Tiku Talsania News

బాలీవుడ్, గుజరాతీ సినిమాలకు చెందిన ప్రముఖ హాస్య నటుడు టికు తల్సానియా శనివారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. టికు తల్సానియా పరిస్థితి విషమంగా ఉంది. టికు తల్సానియాని ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చారు. మీడియా నివేదికల ప్రకారం, 70 ఏళ్ల టికు తల్సానియా ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అతనికి మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్లు విచారణలో తేలింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. టికు తల్సానియా సినిమా పరిశ్రమలో సుపరిచితమైన పేరు. దేవదాస్, జోడీ నంబర్ వన్, శక్తిమాన్, కూలీ నంబర్ 1, రాజా హిందుస్తానీ, దార్, జుడ్వా, ప్యార్ కియాతో డర్నా క్యా, రాజు చాచా, మేళా, అఖియోం సే గోలీ మారే, హంగామా, ధోల్, ధమాల్, స్పెషల్ 26 వంటి వందలాది చిత్రాలలో ఆయన పనిచేశారు.

Ramayana: ఇంట్రెస్టింగ్ గా రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్

70 ఏళ్ల వయసులో కూడా టికు తల్సానియా సినీ పరిశ్రమలో చురుగ్గా ఉంటున్నారు. ఆయన చివరిగా 2024లో విడుదలైన రాజ్‌కుమార్ రావ్ – తృప్తి దిమ్రీల విక్కీ విద్యా కా వో వీడియోలో నటించారు.. గత కొన్ని సంవత్సరాల క్రితం రణవీర్ సింగ్ సర్కస్, హంగామా 2 లో కూడా కనిపించాడు. టికు తల్సానియా కుమార్తె శిఖా తల్సానియా కూడా నటి. ఆమె వీరే ది వెడ్డింగ్, కూలీ నంబర్ 1 మరియు ఐ హేట్ లవ్ స్టోరీ వంటి చిత్రాలలో కనిపించింది. టికు తల్సానియా కుమారుడు రోహన్ తల్సానియా సంగీత స్వరకర్త. టికు తల్సానియా తన నటనా జీవితాన్ని 1984లో DD నేషనల్ TV షో యే జో హై జిందగీతో ప్రారంభించాడు. తరువాత, అతను 1986లో ప్యార్ కే దో బోల్ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. గత 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో అనేక సినిమాలు చేస్తూ వస్తున్నారు.

Show comments