పుష్ప 2 థాంక్స్ మీట్ లో పుష్ప సినిమా గురించి సునీల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ తాను ఒక సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్లానని అక్కడ రాత్రి పది అయితే షాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయని తెలిసిందని అన్నారు. తిండి కూడా దొరకపోవడంతో ఎంతో ప్రయత్నించిన తరువాత దగ్గర్లో ఒక కబాబ్ సెంటర్ ఉందని తెలిసిందని ఆ కబాబ్ అనే పదం ఇండియాదే కాబట్టి అక్కడ ఇండియన్స్ ఉంటారని అక్కడికి వెళ్ళామని అన్నారు. అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి షాప్ క్లోజ్ చేసి ఉందని కానీ నన్ను చూసి ఒక మనిషి లోపలికి వెళ్లి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి పుష్ప ఇంటర్వెల్ బ్లాక్ లో నన్ను చూపించి ఇది మీరే కదా అని అడిగాడని అన్నారు. అతను తనను గుర్తుపట్టి తనకు కావలసిన వస్తువులే కాక తన టీం మొత్తానికి కావాల్సినవన్నీ వండిపెట్టి కడుపు నింపారని అన్నారు. అంతేకాక వారు పాకిస్తాన్ కి చెందిన వారని, వారు తమ కుటుంబ సభ్యులందరికీ వీడియో కాల్ కూడా చేయించి చూపించారని ఈ సందర్భంగా సునీల్ అన్నాడు. అలా పుష్ప సినిమా కేవలం నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లిపోయిందని ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనకు పునర్జన్మ ఇవ్వడానికి అల్లు అర్జున్ సుకుమార్ చేసిన రిస్క్ అంతా ఇంత కాదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.