నటుడు సందీప్ కిషన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అతని నానమ్మ ఆగ్నేసమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, తాజాగా ఆరోగ్యం మరింత విషమించడంతో విశాఖపట్నంలో సోమవారం మృతి చెందినట్లు సమాచారం.
Also Read : Srinidhi Shetty : గ్లామర్ నుంచి నటన దిశగా.. మారుతున్న శ్రీనిధి జర్నీ!
ఈ విషాదాన్ని సందీప్ కిషన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు.. ‘నిన్న మా నానమ్మ గారు మమ్మల్ని విడిచిపెట్టారు. మా తాతయ్య కృష్ణం నాయుడు గారు ఒక షిప్ ఆర్కిటెక్ట్ కాగా, నానమ్మ గారు విశాఖపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేశారు. వారి ప్రేమ కథ ఒక సినిమా కంటే ఏ మాత్రం తక్కువ కాదు. 1960లో మతాంతర వివాహం చేసుకుని, తాతయ్య పేరు జోసెఫ్ కృష్ణం నాయుడు, నానమ్మ పేరు ఆగ్నెస్ లక్ష్మిగా మార్చుకుని ఒక ఆదర్శ జంట గా నిలిచారు. వారి ప్రేమకథ నా జీవితానికి ఇన్స్పిరేషన్. మిస్ యూ నానమ్మ… లవ్ యూ’ అంటూ సందీప్ భావోద్వేగంతో పోస్ట్ చేశారు. అతని ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తూ, సందీప్‌కు ధైర్యం చెబుతున్నారు.
