Rajasekhar: మొదట శ్రీదేవే పెళ్లి ప్రపోజల్ పెట్టింది.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజశేఖర్.. ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’గా గుర్తింపు పొందిన ఆయన, వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ నటనపై మక్కువతో వెండితెరకు పరిచయమయ్యారు. ఫ్యామిలి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నా.. ఆయన వివాహ విషయం సినీ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. అప్పట్లో కుల కట్టుబాట్లు, కుటుంబ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రాజశేఖర్-జీవితల జంట, ఇప్పటికీ టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సెలబ్రిటీ కపుల్‌గా కొనసాగుతున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రాజశేఖర్ గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తన వివాహ బంధం వెనుక ఉన్న ఆసక్తికరమైన సంఘటనలను బయటపెట్టారు.
రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మొదట నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగింది శ్రీదేవి. కానీ మా కుటుంబంలో కుల కట్టుబాట్లు చాలా ఎక్కువగా ఉండేవి, ఖచ్చితంగా సొంత కులానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. నా కెరీర్ వ్యక్తిగత జీవితంలో కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి కుటుంబపరమైన సవాళ్లు ఎదురయాయి. కుటుంబం ఒత్తిడి చేస్తున్న క్రమంలో నేను ఈ విషయాన్ని నటి జీవిత వద్ద ప్రస్తావించా. ఆ సమయంలో జీవిత, ఒకవేళ నువ్వు వేరే ఎవరినైనా వివాహం చేసుకోవాలని అనుకుంటే అది నీ వ్యక్తిగత నిర్ణయం నాకెలాంటి అభ్యంతరం లేదని చేప్పింది. అంతే కాదు రాజశేఖర్ వేరొకరిని పెళ్లి చేసుకుంటే, నేను మాత్రం జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతా అని ఆమె స్పష్టం చేసింది’ అంటూ ఆయన వెల్లడించారు. ఆమె మాటలతో తన జీవిత భాగస్వామి జీవితనే కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరిద్దరూ టాలీవుడ్‌లో ఒక అదర్శ దంపతులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ చేసిన ఈ పాత విషయాలు సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్‌లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?