Site icon NTV Telugu

`స్టాండ‌ప్ రాహుల్`లో శ్రేయారావుగా వ‌ర్ష‌బొల్ల‌మ్మ!

Actor Raj Tarun Dream Girl Sreya Rao Poster from Stand up Rahul Movie

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘స్టాండప్ రాహుల్’. సాంటో మోహన్ వీరంకిని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రానికి ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్‌.

జీవితంలో దేనికోసం క‌చ్చితంగా నిలబడని ఒక వ్య‌క్తి నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లి దండ్రుల కోసం, అతని ప్రేమ కోసం, స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్న త‌న‌ అభిరుచిని చాటుకునే స్టాండ్-అప్ కామిక్ కథతో ఇది తెరకెక్కుతోంది.

Read Also : ఫిలింఛాంబర్ లో ఆనందయ్య మందు పంపిణీ

ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న వ‌ర్షా బొల్ల‌మ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఫ‌స్ట్‌లుక్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఈ చిత్రంలో రాజ్‌త‌రుణ్ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే వ‌ర్ష కూడా శ్రేయా రావు అనే స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ రోల్ చేస్తోంది. డిఫ‌రెంట్ ఇమేజెస్‌తో ఉన్న వ‌ర్ష‌ బొల్ల‌మ్మ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి నిర్వ‌హిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను ‘వెన్నెల‌’ కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్, మ‌ధురిమ తదితరులు పోషిస్తున్నారు.

Exit mobile version