ఫిలింఛాంబర్ లో ఆనందయ్య మందు పంపిణీ

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని నాలుగు సెక్టార్స్ కు చెందిన సభ్యులకు, కార్యాలయ సిబ్బందికి, సినీ పాత్రికేయులకు బుధవారం ఉదయం నెల్లూరుకు చెందిన ఆనందయ్య మందును ఛాంబర్ మెంబర్, నిర్మాత ఇసనాక సునీల్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ, ”మాది నెల్లూరు. అక్కడ కరోనాకు మందు ఇస్తున్న ఆనందయ్యతో నాకు మంచి పరిచయం ఉంది. దాంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను సంప్రదించి, ఆ మందు తీసుకొచ్చి ఇక్కడి సభ్యులందరికి అంద చేయాలనుకున్నాను. ఆనందయ్య గారి చేతుల మీదుగా మందు తయారు చేసుకొని తీసుకు రావడం జరిగింది.

Read Also : అనూహ్యంగా ‘మా’ బరిలోకి నటి హేమ!

ఈ మందును సుమారు 500 మంది నుంచి 700 మంది వరకు సరఫరా చేస్తున్నాం. దాము గారు, సురేందర్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు ఇంకా ఏదైనా అవసరం ఉందంటే అంత క్వాలిటీ తీసుకొచ్చి అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇండస్ట్రీ అంతా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో నా వంతుగా ఈ కార్యక్రమం చేస్తున్నాను” అన్నారు. ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్, నిర్మాత సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ”మాది నెల్లూరు కావడంతో చాలామంది ఫోన్లు చేసి ఈ మందు కావాలని అడుగుతున్నారు. నేను సునీల్ గారితో మాట్లాడి ఈ మందును తెప్పించగలిగాను. దీనిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని నిరూపణ అయ్యింది. కరోనా రాకుండా ఉండే మందును మాత్రమే మేం ఇక్కడ పంపిణీ చేస్తున్నాం” అని అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-