Blood Bank: చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100వ వ సారి రక్తదానం చేసిన నటుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన బ్లడ్ బ్యాంక్ స్థాపకులు మెగాస్టార్ చిరంజీవికి అండదండగా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్రమే.వందలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్‌తో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతర సేవలను అందిస్తోంది.ఈ బ్లడ్ బ్యాంకుకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు.మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్.. రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం.ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయటం గొప్పరికార్డు .100వ సారి రక్తదానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు.
Also Read: Mrunal Takur : జిమ్ లో తెగ కష్టపడుతున్న మృణాల్.. వీడియో వైరల్..
Also Read
- Mrunal Thakur: ధనుష్ తో బ్రేకప్, క్రికెటర్ తో డేటింగ్.. వైరల్ అవుతున్న మృణాల్ ప్రేమ ముచ్చట్లు
- OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
- Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
- Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
అయితే అనుకోకుండా 100వ సారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు.హైదరాబాద్ వచ్చిన ఆయన విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనం గా సత్కరించారు .ఆయనతో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన మురళీ మోహన్‌ను కూడా కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరితో పాటు మహర్షి రాఘవ సతీమణి శిల్పా చక్రవర్తి కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.చిరంజీవి బ్లడ్ బ్యాంకు చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ శేఖర్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు సీఓఓ రమణస్వామి నాయుడు, మెడికల్ ఆపీసర్ డాక్టర్ అనూషగారి ఆధ్వర్యంలో మహర్షి రాఘవ రక్తదానం చేశారు.ఈ సందర్భంలో మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆయన సతీమణి శిల్పా చక్రవర్తితో కలిసి ఆపద్బాంధవుడు చిత్రంలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.మూడు నెలలకు ఓ సారి లెక్కన 100 సార్లు రక్తదానం చేయటం గొప్పవిషయమని ఇలా రక్తదానం చేసిన వ్యక్తుల్లో మహర్షి రాఘవ ప్రప్రథముడని చిరంజీవి అభినందించారు.
తాజావార్తలు
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
-
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్‌లో ఆ మాటలు వినిపించవు
-
Mrunal Thakur: ధనుష్ తో బ్రేకప్, క్రికెటర్ తో డేటింగ్.. వైరల్ అవుతున్న మృణాల్ ప్రేమ ముచ్చట్లు
-
Unemployment Crisis: చేతిలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం ఎందుకు దొరకడం లేదు? షాకింగ్ రిపోర్ట్
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?