సీనియర్ నటుడి కాలు ఫ్యాక్చర్… హాస్పిటల్ లో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు కార్తీక్ ప్రస్తుతం చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. గురువారం ఉదయం ఇంటిలో వర్కౌట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆయన జారిపడ్డారు. దాంతో కాలు ఎముక విరిగినట్టు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం కూడా అదే చోట కాలు విరగడంతో అప్పట్లో శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడు కూడా హాస్పిటల్ లో చేర్చి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన కార్తీక్ కొంతకాలం రాజకీయపార్టీలు పెట్టి తమిళ జనం నోట నానారు.
Read Also : కొత్త సినిమా మొదలెట్టేసిన నయనతార
Also Read
అలానే ఆయన కొడుకునూ నటుడిని చేశారు. ఆ మధ్య వరుస పరాజయాలు ఎదురుకావడంతో నటనకు దూరమై, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ-ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కూడా హిందీ ‘అంధాధూన్’ తమిళ రీమేక్ ‘అంధగన్’లో కార్తీక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ హీరోగా ఆయన తండ్రి త్యాగరాజన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కార్తీక్ తో పాటు సిమ్రాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, అతి త్వరలోనే ఆయన ఇంటికి చేరుకుంటారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Aadhaar Rule Change from July 1: జూలై 1 నుంచి ఆధార్‌లో కీలక మార్పు.. ఈ సేవ పూర్తిగా ఉచితం!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
No Releases : ఈ సినిమాల విడుదలకు మోక్షం ఎప్పుడు..?
-
France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు!
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!