NTV Telugu Site icon

ఆచార్య : సిద్ధ, నీలాంబరిల ప్రేమ షడ్రుచుల సమ్మేళనం…!

Acharya introduces Siddha's love 'Neelambari'

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా… రామ్ చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు ‘ఆచార్య’ నుంచి సిద్ధ, నీలాంబరిల లవ్ స్టోరీని రివీల్ చేశారు మేకర్స్. సిద్ధ, నీలాంబరిల ప్రేమ షడ్రుచుల సమ్మేళనం అంటూ రామ్ చరణ్, పూజాహెగ్డేల రొమాంటిక్ పిక్ ను విడుదల చేశారు. కాగా ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘లాహే లాహే’ అనే సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ఇక మెగా స్టార్, మెగా పవర్ స్టార్… ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం ఉండడంతో సినిమాపై మెగా అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి.