కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. ఇప్పటికే ‘బాహుబలి, ఘాజీ, అరణ్య’ వంటి పాన్ ఇండియా మూవీస్ చేసిన రానా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను సిహెచ్ రాంబాబుతో కలిసి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్, రానా మూవీ షూటింగ్ పూర్తి కాగానే, రానాతో ఈ సినిమాను ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ‘టాప్ హీరో, దేవుడు, జంబలకిడి పంబ, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ వంటి చిత్రాలు గతంలో నిర్మించిన ఆచంట గోపీనాథ్ ఆ మధ్య నయనతార నటించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నోడిగల్’ను ‘అంజలి సీబీఐ’గా తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. కాస్తంత విరామం తర్వాత రానాతో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తుండటం ఆనందంగా ఉందని, ఇప్పటికే కథ ఓకే అయ్యిందని, కథ, కథనం, కథానాయకుడి పాత్రచిత్రణ కొత్తగా ఉంటాయని ఆచంట గోపీనాథ్ చెబుతున్నారు.
రానాతో ఆచంట గోపీనాథ్, సీహెచ్ రాంబాబు పాన్ ఇండియా మూవీ!
