బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ రిమాండ్ పొడిగించారు. అతన్ని జనవరి 29 వరకు పోలీసు కస్టడీకి పంపారు. శుక్రవారం జనవరి 24న బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. నిందితుడి కస్టడీ జనవరి 24తో ముగియడంతో అతడిని బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు ఈ కేసులో తగిన పురోగతి ఉందని, ఇతర కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించింది. షాజాద్‌ను విచారించిన సమయంలో పోలీసులకు ఎలాంటి సమాచారం అందింది అనేది ఇంకా తెలియరాలేదు. మరోవైపు సీసీటీవీలో కనిపిస్తున్న దాడి చేసిన వ్యక్తి, తన క్లయింట్ వేర్వేరుగా ఉన్నారని నిందితుడు షాజాద్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర సహచరుల అనుమానాల కారణంగా ముంబై పోలీసులు మరింత కస్టడీని కోరుతున్నారు. నిందితుడు నేరానికి ఉపయోగించిన ఆయుధానికి సంబంధించిన సమాచారాన్ని అందించడంలో సహకరించడం లేదని పోలీసులు తెలిపారు.
Ramayana: The Legend Of Prince Rama Review: రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ రివ్యూ
సిసిటివి ఫుటేజీతో ముఖ గుర్తింపును సరిపోల్చడానికి, పోలీసులు నిందితుడిని కస్టడీలో ఉంచాలని కోరారు. అలాగే నేరం సమయంలో అతడు ధరించిన బూట్లను ఇంకా కనుగొనాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇక కోల్‌కతాలో సిమ్ కార్డ్ కొనుగోలు చేయడానికి నిందితులు ఆధార్ కార్డును ఉపయోగించిన కోల్‌కతా నివాసి ఖుక్మోనీ జహంగీర్ షేక్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేయనున్నారు. జాయింట్ పోలీస్ కమీషనర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సత్యనారాయణ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం, సైఫ్ వాంగ్మూలాన్ని గురువారం ఆయన నివాసం ‘సద్గురు శరణ్’లో రికార్డ్ చేశారు. గతంలో కరీనా కపూర్ వాంగ్మూలాన్ని కూడా బాంద్రా పోలీసులు నమోదు చేశారని ఆయన చెప్పారు. బుధవారం, ముంబై పోలీసులు బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంటి నుండి నిందితుల అనేక వేలిముద్రలను కనుగొన్నారు. ఈ వేలిముద్రలు తమ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారుతాయని పోలీసులు భావిస్తున్నారు.