Abhishek Bachchan : ఆమె మాటలే నాకు బలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తరచూ మీడియా ముందుకు వచ్చి తన మనసులోని మాటలను ఓపిగ్గా, నిజాయితీగా పంచుకుంటారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతను వ్యక్తిగత జీవితం, ఒత్తిడులు, కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
Aslo Read : Prabas : ప్రభాస్-నీల్ ‘రవణం’ పై ఉన్న గాసిప్స్‌కి పుల్‌స్టాప్..
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
“నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ కొన్ని సార్లు కఠినంగా ఉండాల్సి వస్తుంది. నటుడిగా అలా ఉండలేను. ఎందుకంటే అది నా ప్రొఫెషన్‌పై ప్రభావం చూపుతుంది. ఇది ఆర్టిస్టులందరికీ ఎదురయ్యే సవాలే. ఎన్ని విమర్శలు ఎదురైనా నలుగురిని సంతోషపెట్టాలనే ప్రయత్నం చేస్తాను’ అని తెలిపారు. అలాగే ఆయన పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్, తప్పుడు వార్తల పై కూడా స్పందిస్తూ.. ‘నాపై వచ్చే నెగెటివిటీ ఎదుర్కోవడానికి ఐశ్వర్య ఇచ్చిన సలహాలు పాటిస్తాను. ఆమె ఎప్పుడు ఒక్కటే చేబుతుంది.. ‘నెగిటివ్ గురించి ఆలోచించకపోతే అవి మనపై ప్రభావం చూపదు. పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టి పెట్టాలి’ అని. ఈ మాటలు నాకు ఎన్నో సందర్భాల్లో బలం ఇచ్చాయి. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు మనం మన కోసం సమయం కేటాయించుకోవాలి. ఏకాంత క్షణాలు అవసరం. కానీ అలాగని ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండలేను. నాకు ఎవరైనా మాట్లాడే వ్యక్తి కావాలి. నాకు కుటుంబమే ఒక శక్తి. మేమంతా ఇంట్లో కలిసే ఉంటాం. సరదాగా గడుపుతుంటాం. అదే నా ఆత్మీయతకు మూలం’ అని అన్నారు. ఈ మాటల్లో అభిషేక్‌కు కుటుంబం ఎంత ప్రాధాన్యమో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నటించిన చిత్రం ‘కాళిదర్ రాపత’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. జూలై 4 నుంచి ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనాథ పిల్లల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, తమిళంలో విజయవంతమైన ‘కరుపు దురై’ చిత్రానికి హిందీ రీమేక్.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?