Site icon NTV Telugu

Abhishek Bachchan : ఆమె మాటలే నాకు బలం..

Abhishek Bachchan

Abhishek Bachchan

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తరచూ మీడియా ముందుకు వచ్చి తన మనసులోని మాటలను ఓపిగ్గా, నిజాయితీగా పంచుకుంటారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతను వ్యక్తిగత జీవితం, ఒత్తిడులు, కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి  తన అభిప్రాయాలను వెల్లడించారు.

Aslo Read : Prabas : ప్రభాస్-నీల్ ‘రవణం’ పై ఉన్న గాసిప్స్‌కి పుల్‌స్టాప్..

“నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ కొన్ని సార్లు కఠినంగా ఉండాల్సి వస్తుంది. నటుడిగా అలా ఉండలేను. ఎందుకంటే అది నా ప్రొఫెషన్‌పై ప్రభావం చూపుతుంది. ఇది ఆర్టిస్టులందరి‌కీ ఎదురయ్యే సవాలే. ఎన్ని విమర్శలు ఎదురైనా నలుగురిని సంతోషపెట్టాల‌నే ప్రయత్నం చేస్తాను’ అని తెలిపారు. అలాగే ఆయన పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్, తప్పుడు వార్తల పై కూడా స్పందిస్తూ.. ‘నాపై వచ్చే నెగెటివిటీ ఎదుర్కోవడానికి ఐశ్వర్య ఇచ్చిన సలహాలు పాటిస్తాను. ఆమె ఎప్పుడు ఒక్కటే చేబుతుంది.. ‘నెగిటివ్ గురించి ఆలోచించకపోతే అవి మనపై ప్రభావం చూపదు. పాజిటివ్ విషయాల‌పై మాత్రమే దృష్టి పెట్టాలి’ అని. ఈ మాటలు నాకు ఎన్నో సందర్భాల్లో బలం ఇచ్చాయి. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు మనం మన కోసం సమయం కేటాయించుకోవాలి. ఏకాంత క్షణాలు అవసరం. కానీ అలాగని ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండలేను. నాకు ఎవరైనా మాట్లాడే వ్యక్తి కావాలి. నాకు కుటుంబమే ఒక శక్తి. మేమంతా ఇంట్లో కలిసే ఉంటాం. సరదాగా గడుపుతుంటాం. అదే నా ఆత్మీయతకు మూలం’ అని అన్నారు. ఈ మాటల్లో అభిషేక్‌కు కుటుంబం ఎంత ప్రాధాన్యమో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ నటించిన చిత్రం ‘కాళిదర్ రాపత’ ప్రచారంలో బిజీగా ఉన్నారు. జూలై 4 నుంచి ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనాథ పిల్లల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, తమిళంలో విజయవంతమైన ‘కరుపు దురై’ చిత్రానికి హిందీ రీమేక్‌.

Exit mobile version