బాలీవుడ్‌లో ఒకప్పుడు ఆదర్శ జంటగా పేరుగాంచిన అమీర్ ఖాన్–కిరణ్ రావు విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా అమీర్ ఖాన్ తన అనుభవాన్ని నిజాయితీగా పంచుకోవడంతో, వారి బంధంలో ఉన్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అమీర్ చెప్పిన ప్రకారం, ఒకసారి వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో, తాను కిరణ్‌తో రోజుల తరబడి మాట్లాడటం మానేశారట. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు.. నాలుగు రోజుల పాటు నిశ్శబ్దంగా ఉన్నారు. కిరణ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన స్పందించలేదని, చివరికి ఆమె కన్నీరు పెట్టుకున్నారని అమీర్ గుర్తు చేసుకున్నారు.
Also Read : Dhanush : సినిమా రిలీజయి నెల కాకముందే.. ఓటీటీలోకి ధనుష్ హిట్ మూవీ
అమీర్ తన స్వభావం గురించి చెప్పుకుంటూ.. “నాకు కోపం వస్తే నా చుట్టూ షట్టర్స్ వేసినట్టే ఫీల్ అవుతాను. అలా పూర్తిగా దూరమై పోతాను” అని తెలిపారు. కానీ ఇదే విషయమే వారి సంబంధంలో పెద్ద గ్యాప్‌కి కారణమైందని అమీర్ ఒప్పుకున్నారు. కిరణ్ పట్ల తాను ఆ సమయంలో తగ్గిపోయి, ఆమెతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోకపోవడం వల్లే ఇబ్బందులు పెరిగాయని ఆయన నిజాయితీగా చెప్పుకొచ్చారు.
అందుకే భార్య భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా అని మాట్లాడుకుంటే సులభంగా పరిష్కారమవుతుంది. కానీ అమీర్, కిరణ్ మధ్య అది జరగకపోవడం వారి అనుబంధానికి చెక్ పెట్టింది. చివరికి ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ మూడోసారి ప్రేమలో ఉన్నారని, గౌరి స్ప్రాట్ అనే బెంగళూరు యువతి తో తన బంధాన్ని కొనసాగిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మిలియన్ల మందికి ‘పర్ఫెక్ట్ కపుల్ గా కనిపించిన ఈ జంట వెనుక దాగి ఉన్న నిజం ఇప్పుడు బయటపడింది.
