సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘శివప్పు ముంజల్ పచ్చై’ చిత్రం తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ హీరోయిన్లు గా నటించారు. తాజాగా ఈ చిత్రంలో నుంచి ‘ఆహ ఎవరిది’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు చిత్రబృందం. హీరోహీరోయిన్ల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను ఆనంద్ అరవిందాక్షన్, యామిని ఘంటసాల ఆలపించగా… వెన్నెలకంటి లిరిక్స్ అందించారు. యూత్ ను బాగా ఆఆకట్టుకుంటున్న ఈ రొమాంటిక్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రాన్ని ‘బిచ్చగాడు’ ఫేమ్ ‘శశి’ డైరెక్ట్ చేశాడు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కెమెరామేన్. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.