NTV Telugu Site icon

Shanmukha: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆది సాయికుమార్ థ్రిల్లర్ మూవీ..

Untitled Design (56)

Untitled Design (56)

టాలీవుడ్ యాక్షన్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు తీసిన ఆది  నటన పరంగా తండ్రి పేరు నిలబెట్టాడు. దీంతో తెలుగులో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఆది ‘షణ్ముక’ అనే థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడు. అవికాగోర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్పని ద‌ర్శకత్వం వహిస్తుండగా.. సాప్పని బ్రదర్స్ స‌మ‌ర్పణ‌లో తుల‌సీరామ్ సాప్పని, ష‌ణ్ముగం సాప్పని, రమేష్‌ యాదవ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: Jyothika: ఇక్కడ ఒంటరిగా పోరాడాల్సి ఉంటుంది..

కాగా తాజాగా ఈ మూవీ మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఈ సందర్భంగా దర్శకుడు షణ్ముగం సాప్పని మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా ఆది కనిపించనున్నాడు. ఇప్పటి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో తెర‌కెక్కిస్తున్నాం. ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ ‘షణ్ముక’ కి కూడా స్టనింగ్ మ్యూజిక్‌ను అందించాడు. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుక‌రాబోతున్నాము. త‌ప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది’ అని అన్నారు. ఇక షణ్ముగం మాటలను బట్టి చూస్తే ఆది ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టేల కనిపిస్తున్నాడు.