Site icon NTV Telugu

AA22xA6 : అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనే..!

Deepika Padukone In Aa22xa6

Deepika Padukone In Aa22xa6

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ ఎంటర్‌టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచే సినిమాపై అభిమానులకు ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్షన్, యాక్షన్-ఫాంటసీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను ఒక్కోక్కటిగా ప్రక‌టిస్తున్నారు మేక‌ర్స్.

Also Read : Aadi Saikumar : ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లింగ్ ‘శంబాల’ టీజర్ రిలీజ్..

ఇక ఈ మూవీలో క‌థానాయిక‌గా ఇప్పటికి చాలా పేర్లు వినబడగా మొత్తనికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే న‌టించ‌బోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రక‌టించింది. ఈ సంద‌ర్భంగా దీపికా పాత్రను రివీల్ చేస్తూ స్పెష‌ల్ వీడియోను పంచుకుంది.దీన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపికా పదుకొనె కూడా ఈ టీమ్‌తో జాయిన్ కావటం విశేషం. మొత్తానికి అమ్మడు లిస్ట్ లో మరో పాన్ ఇండియా మూవీ వచ్చి చేరింది.

Exit mobile version