Site icon NTV Telugu

Aa Okkati Adakku : మొదటి రోజు కంటే ఎక్కువగా.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న అల్లరోడు..

Okkati

Okkati

టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..కామెడీ సినిమాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న అల్లరోడు..ఆ మధ్య వరుస ఫ్లాప్స్ తో డీలా పడ్డాడు.దీనితో కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి నాంది సినిమాతో యాక్షన్ హీరోగా అదరగొట్టాడు.ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం , ‘ఉగ్రం`వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఈ ఏడాది `నా సామిరంగ సినిమాలో కీలక పాత్రలో నటించిన నరేష్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.తాజాగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి తనకి ఎంతో ఇష్టమైన కామెడీ జోనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..

ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మించారు..ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. మే 3 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ప్రీ బిజినెస్ కూడా బాగానే జరిగింది..దాంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే వాసులు అవుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 1.62 కోట్లు గ్రాస్ ను రాబట్టింది.. రెండో రోజు ఈ సినిమా మొదటి రోజు కంటే ఎక్కువగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా మొదటి రెండు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా 3.34 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

Exit mobile version