‘నేరు’, ‘సూపర్ శరణ్య’ చిత్రాలతో ఆకట్టుకున్న అనశ్వర రాజన్, ‘ఛాంపియన్’ మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి భలేగా అలరించింది. తన సహజ నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. కేవలం లుక్స్ పరంగానే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లో చూపించిన పరిణతికి రివ్యూవర్ల నుంచి మంచి మార్కులు పడ్డాయి. స్ట్రైట్ తెలుగు సినిమాతో టాలీవుడ్‌లో తన మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై, ‘తన్నీర్మథన్ దింగల్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి అనశ్వర రాజన్ ‘యావత్‌మన్ నామ్’, ‘సూపర్ శరణ్య’ చిత్రాలతో క్యూట్‌నెస్ పంచిన ఈ మలయాళ భామ, ‘నేరు’ సినిమాలో అంధురాలిగా అద్భుత నటనతో మెప్పించింది. రీసెంట్‌గా ‘యాబ్రాండ్ అన్విజన్’, ‘ప్రణయవిలాసం’ వంటి ప్రాజెక్ట్‌లతో సత్తా చాటిన అనశ్వర, ఇప్పుడు సౌత్ అండ్ పాన్-ఇండియా రేంజ్‌లో సరికొత్త ప్రాజెక్ట్‌లతో అలరించేందుకు సిద్ధమవుతోంది. హిందీ రీమేక్ ‘యారియా 2’లో విభిన్న పాత్రతో పాటు ప్రస్తుతం దక్షిణాది భాషలలో కొత్త లైనప్‌ను ప్లాన్ చేసుకుంటోంది. కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రల ద్వారా తన కెరీర్‌ను బలంగా నిర్మించుకుంటోంది. ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ప్రతి సినిమాను ఒక అవకాశంగా మార్చుకుంది అనశ్వర. మలయాళంలో ఉన్నంత గ్రిప్ ఇతర భాషల్లో రాకపోయినా, తన యాక్టింగ్ స్కిల్స్‌తో నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌లో డెఫినెట్‌గా ప్రామిసింగ్ కమ్‌బ్యాక్ ఇస్తుందనడంలో డౌట్ లేదు.
మలయాళంలో వరుస హిట్లు కొట్టిన అనశ్వర రాజన్, అదర్ లాంగ్వేజెస్ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగేందుకు ప్లాన్ చేస్తుంది. ఇక బోల్డ్ అటెంప్ట్ గా హిందీలో చేసిన ‘యారియా 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, అనశ్వర పర్ఫార్మెన్స్ అండ్ క్యూట్‌నెస్‌కి నార్త్ ఆడియన్స్ నుండి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు పాటు, తమిళ్‌లో జి.వి. ప్రకాష్‌తో ‘లక్కీ ది సూపర్‌స్టార్’ మరియు రొమాంటిక్ డ్రామా ‘విత్ లవ్’ చిత్రాలతో తన కెరీర్‌ను చాలా ప్లాన్డ్‌గా విస్తరిస్తోంది.

