ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ మూవీ ‘మహా సముద్రం’. ఈ చిత్రంలో అను ఇమాన్యుయేల్, అదితి రావ్ హైదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 19న ‘మహా సముద్రం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే… ‘మహా సముద్రము’లో రంభపై స్పెషల్ సాంగ్ ఉందట. ఇటీవలే ఈ మాస్ సాంగ్‌ను చిత్రీకరించింది. అయితే ఈ సాంగ్ లో రంభ కాకుండా ఆమె కటౌట్లు, ఫోటోలు మాత్రమే కన్పిస్తాయని అంటున్నారు. ఈ పాటను ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో జగపతి బాబు, శర్వానంద్‌లపై చిత్రీకరించారు. ఇందులో జగపతి బాబు రంభ అభిమానిగా కనిపించనున్నారు. ఈ పాటను చిత్రీకరించే ముందు మేకర్స్ రంభ నుంచి పర్మిషన్ తీసుకున్నారట. ‘మహా సముద్రం’ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
‘మహాసముద్రం’లో రంభపై స్పెషల్ సాంగ్ ?
