NTV Telugu Site icon

Kalki 2898 AD: కల్కి సినిమాకి అరుదైన ఘనత

Kalki 2898 Ad

Kalki 2898 Ad

ఇండియన్ మూవీ డేటా బేస్ సంస్థ సినిమాలకు సంబంధించి పలు సర్వేలు చేపడుతూ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇండియన్ మూవీస్ కి సంబంధించి ఎలాంటి డేటా కావాలన్నా ఐఎండీబీలో వెళ్లి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. అయితే తాజాగా ఇండియాలో మోస్ట్ పాపులర్ సినిమాలు అంటూ ఒక లిస్ట్ రిలీజ్ చేసింది ఐఎండీబీ. 2024 సంవత్సరానికి గాను ఈ లిస్టు ని రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలు లిస్టులో కల్కి మొదటి స్థానాన్ని సంపాదించింది.

KTR Reacts on Allu Arjun Issue: ఇదంతా గవర్నమెంట్ ప్లాన్.. అల్లు అర్జున్ అంశంపై కేటీఆర్ రియాక్షన్

ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ కల్కి 2898 ఏడీ చిత్రం ఆ అరుదైన ఘనతను సాధించింది. IMDB లో అత్యంత ప్రజాదరణ పొందిన పది చిత్రాలలో నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది కల్కి. చిత్ర యూనిట్ ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని ఎక్స్ లో పోస్ట్ చేసింది.అమితాబచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.

Show comments