Site icon NTV Telugu

క్రేజీ రీమేక్ కోసం భారీ విలేజ్ సెట్

A huge village set for Chatrapathi Hindi Remake

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ “ఛత్రపతి” రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోసం మేకర్స్ ఓ భారీ విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సెట్ నిర్మాణం జరుగుతోందట. ఈ రీమేక్ మొదటి షెడ్యూల్ జూలై మొదటి వారం నుండి ఈ సెట్‌లో జరుగుతుంది. షూటింగ్‌లో ప్రధాన భాగం హైదరాబాద్, ముంబై, బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఖరారు చేయలేదు మేకర్స్. మరోవైపు బెల్లకొండ శ్రీనివాస్ “కర్ణన్” రీమేక్ లో నటించనున్నారు. తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన “కర్ణన్” బ్లాక్ బస్టర్ హిట్ నువు అందుకుంది. ఈ చిత్రం తెలుగు రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించనున్నారు. అయితే ఛత్రపతి రీమేక్ తరువాత కర్ణన్ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. మరి బెల్లంకొండ హీరో “ఛత్రపతి” లాంటి భారీ రీమేక్ తో బాలీవుడ్ లో సత్తా చాటుతాడేమో చూడాలి.

Exit mobile version