NTV Telugu Site icon

Thala Movie: గ్రాండ్ గా నిర్వహించిన ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

February 7 (73)

February 7 (73)

అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తల’. ఈ మూవీలో హీరోగా అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ తొలి పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్ గా, రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర నటీనటులు కీలక పాత్ర పోషించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్ లు కూడా మొదలెట్టింది. ఇందులో భాగంగా తాజాగా ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు అమ్మ రాజశేఖర్,హీరో రాగిన్ రాజ్ తోపాటుగా నటి ఎస్తేర్,నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్,ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటి విజి చంద్రశేఖర్,నటుడు ప్రభాకర్ తదితరులు పాల్గోన్నారు.

Also Read:  Laila : ‘లైలా’ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌.. నా కెరీర్ లో మెమరబుల్ మూవీ : విశ్వక్సేన్

ఇందులో భాగంగా నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘తల’ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్ లో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసి మీ అందరూ మా అమ్మ రాజశేఖర్ ఫ్యామిలీకి, అమ్మ రాగిన్‌కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని, రాగిన్ కల నిజం కావాలని కోరుకుంటున్నాను. అమ్మా నాన్నను ఎలా మర్చిపోరో.. తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్‌ని కూడా అలా మర్చిపోరు. మీరెప్పుడూ మా ఫ్యామిలీస్‌తో ఉంటారు’అని తెలిపాడు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. ‘తల’ మూవీతో మునుపటి అమ్మ రాజశేఖర్‌ను చూస్తారు. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. అతను చెప్పిన దానికంటే ఇంకా బెటర్ గా తీశారు. తన కొడుకును హీరోగా నిలబెట్టాలన్న కసి కనిపించింది. రాగిన్ రాజ్ చాలా అనుభవం ఉన్న నటుడులా కనిపించాడు. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. ఈ 14న రిలీజ్ అవుతున్న ‘తల’ అన్ని రకాల ఎమోషన్స్ తో మీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది’ అన్నారు. అలాగే ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒకరు సినిమా గురించి మాట్లాడుతూ. ‘తల’ ను విజయవంతం చేయాలి అని కోరారు.