ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఎన్నికలు 2025 ఫిబ్రవరి 27న జరగనుండగా, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 3న నుంచీ నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవగా ఫిబ్రవరి 10వ తేదీ వరకు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. ఇక ఇదిలా ఉండగా గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది.
Vishwak Sen: విశ్వక్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి లక్షల్లో నెల జీతం, ఫ్లాట్!
డోర్ నంబర్ 31-22-1639, విద్యార్హత బీకాం, పుట్టిన తేదీ 1975 ఆగస్టు 9వ తేదీన వివరాలతో బూత్ నంబర్ 2014, వరుస సంఖ్య 1179తో మహేశ్ బాబు ఫొటో అప్లోడ్ చేసినట్లు జాబితాలో ఉంది. నిజానికి మహేష్ బాబు హైదరాబాదు జూబిలీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంలో అక్కడే ఆయన ఎన్నికలలో తన ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. కాగా ఇప్పుడు మహేష్ పేరుతో ఒక దొంగ ఓటు పుట్టుకు రావడం సంచలనం రేపుతోంది. దీనిపై ఎన్నికల అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.