మలయాళ ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి నిర్మాతగా హలొ, చిత్ర లహరి ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కెరీర్ బెస్ట్ పారామెన్స్ తో కళ్యాణి ప్రియదర్శని అదరగొట్టింది.
Also Read : Pongal Release 2026 : ఉన్నవాటికి థియేటర్స్ దొరకవు.. సంక్రాంతి రేస్ లోకి మరో సినిమా
రిలీజ్ అయినా తోలి మూడు రోజులకు గాను రూ. 42 కోట్ల గ్రాస్ రాబట్టిన లోక రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తోంది. సండే నాటికి 10 రోజులు రన్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 167.51 కోట్ల గ్రాస్ రాబట్టి మెగా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఇండియాలో రూ. 83.61కోట్లు రాగా ఓవర్సీస్ లో రూ. 83.91 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటు తెలుగులోను లోక హిస్టరీ క్రియేట్ చేసే దిశగా వెళుతోంది. తెలుగులో హాయిస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ సినిమాగా నస్లీన్ నటించిన ప్రేమలు రూ. 13. 5 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తెలుగులో రిలీజ్ కు ముందు ఇటుంవటి హడావిడి లేకుండా వచ్చిన లోక 10 రోజులకు గాను రూ. 11 కోట్లు రాబట్టింది. ఇంకో రూ. 2.5 కోట్లు రాబడితే మలయాళ డబ్బింగ్ సినిమాలలో లోక ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే. అటు కేరళలోను లోక ఇండుస్ట్రీ హిట్ దిశగా దూసుకెళ్తోంది.
