Site icon NTV Telugu

6Journey: టేస్టీ తేజ కీలక పాత్రలో సినిమా.. ఆసక్తికరంగా టీజర్

Tasty Teja

Tasty Teja

రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘6జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌కు సిద్ధ‌మైన ఈ సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న క్రమంలో గురువారం ఈ మూవీ టీజ‌ర్‌ను పటేల్ రమేష్ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా టేస్టీ తేజ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్.

Haryana: హర్యానా బీజేపీలో అలకలు.. టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి

బిగ్ బాస్ షోకి వెళ్లక ముందే ఈ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా మళ్లీ షూట్‌లో పాల్గొన్నా, నాకు ఈ టీం ఎంతో సహకరించింది. కొత్త వాళ్లతో చేస్తున్న ఈ సినిమా కోసం మా రవి అన్న బడ్జెట్ గురించి ఎక్కడా ఆలోచించలేదు’ అని అన్నారు.బషీర్ ఆలూరి దర్శకత్వం లో నటించడం చాలహ్యాపీగా అనిపించిందని అన్నాడు. సమీర్ దత్త, టేస్టీ తేజ, రవి ప్రకాష్ రెడ్డి,పల్లవిరాథోడ్ , రమ్యకృష్ణ , సాహితి,అభిరాం, సంజయ్ ఆచార్య, జబర్దస్త్ చిట్టిబాబు, అవంతిక, సోహైల్, సాయి సాగర్, షరీఫ్ ,బాబా కల్లూరి, మిలటరీ ప్రసాద్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.

Exit mobile version