ఆయనో స్టార్ నటుడు. దాదాపు 400లకు పైగా సినిమాల్లో నటించాడు. తన విలక్షణ నటనతో జాతీయ అవార్డులు కూడా అందుకున్నాడు. నటన మీద మక్కువతో ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేసి ఇండస్ట్రీకి వచ్చాడు. ఇప్పుడు స్టార్ నటుడిగా ఎదిగాడు. 65 ఏళ్లలో నటుడిగా తన కలను సాకారం చేసుకన్న అతడు ఇప్పుడు చదువుపై దృష్టిపెట్టాడు. అందుకే టెన్త్ క్లాస్ ఎక్సామ్స్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్నాడు.
Also Read: 3 Trains on One Track: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు
ఇంతకీ ఆయన ఎవరంటే.. మలయాళ స్టార్ నటుడు ఇంద్రన్స్. మాలీవుడ్‌లో స్టార్ నటుడిగా గుర్తింపు పొందిన ఇంద్రన్స్.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎనిమిదవ తరగతిలోనే చదువు ఆపేశాడు. ట్రైలరింగ్ చేస్తూ 1981లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సినిమాలకు ముందు టైలరింగ్ చేసుకునే ఆయన ప్రొడక్షన్ హౌస్‌లకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో నటనపై ఇష్టంతో మెల్లిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ.. ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా ఎదిగారు.
Also Read: Suriya: సెట్ లో ప్రమాదం.. తన ఆరోగ్య పరిస్థితి చెప్పిన సూర్య..
దాదాపు 400 సినిమాల్లో నటించిన ఆయన జాతీయ అవార్డులతో పాటు పలు రాష్ట్ర అవార్డులు కూడా అందుకున్నాడు. అలాంటి ఇంద్రన్స్ 65 ఏళ్లలో పదో తరగితి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా పాఠాలు వింటున్నాడు. తన నివాసానికి దగ్గర్లో ఉన్న స్టేట్ రన్ స్కూల్లో ప్రతి ఆదివారం క్లాస్‌లు వింటున్నట్టు రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో తెలిపాడు. ఈ వయసులో చదువుపై దృష్టిపెట్టడానికి కారణం ఏంటని ఇంటర్య్వూలో అడగ్గా.. తను ఓ స్టార్ నటుడు అయినా నిరాక్షరాస్యుడుగా ఉండటం ఇష్టం లేదన్నారు. నిరక్షరాస్యుడిగా ఉండడం అంటే అందుడితో సమానమని, తప్పనిసరిగా చదువు ఉండాలని చెప్పుకొచ్చాడు.