SarangaDhara Movie: అరవై ఐదేళ్ళ ‘సారంగధర’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటరత్న యన్.టి.రామారావు, విశిష్ట నటి భానుమతి జంటగా నటించిన పలు చిత్రాలు జనరంజకంగా సాగాయి. వారిద్దరూ జంట కాకున్నా, కన్నులపండుగ చేస్తూ నటించిన సినిమాలున్నాయి. అలాంటి వాటిలో చారిత్రకాంశాల ఆధారంగా తెరకెక్కిన పురాణగాథ ‘సారంగధర’ కూడా చోటు సంపాదించింది. తెలుగునేలపై ‘సారంగధర’,’చిత్రాంగి’ పేర్లు విశేషంగా వినిపించడానికి ఈ కథయే కారణం! యన్టీఆర్ ‘సారంగధర’గా, భానుమతి ‘చిత్రాంగి’గా నటించిన ‘సారంగధర’ చిత్రం 1957 నవంబర్ 1న విడుదలై అలరించింది.
‘సారంగధర’ కథ ఏమిటంటే – వేంగి రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్ర మహారాజుకు భార్య రత్నాంగి, తనయుడు సారంగధర ఉంటారు. రాజరాజ నరేంద్రుని కొలువులో మహామంత్రి సింగన్న, ఆయన కొడుకు సుబుద్ధి, నన్నయ్య భట్టారకుడు, మాండవ్యుడు ముఖ్యులు. సారంగధరునికి సుబుద్ధి, మాండవ్యునితో మంచి స్నేహం. తమ సామంత రాజయిన మంగరాజు కుమార్తె కనకాంగిని సారంగధరుడు ప్రేమిస్తాడు. ఇద్దరూ మనసులు ఇచ్చి పుచ్చుకుంటారు. తండ్రి ఆదేశంపై రంపసీమ ప్రభువు రంగనాథరాజుతో మైత్రికై వెళతాడు సారంగధర. దారిలో అతనికి రంగనాథరాజు కూతురు చిత్రాంగి తారసపడుతుంది. ఆమె అతనిపై మనసు పారేసుకుంటుంది. రంగనాథరాజుతో సంధి కుదిరాక, రాజరాజ నరేంద్రుడు పంపిన చిత్రపటాల్లో సారంగధరుని చూసి అతనితో వివాహానికి అంగీకరిస్తుంది చిత్రాంగి.
Also Read
- Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
- South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
- Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
- 2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
అయితే అప్పటికే తాను కనకాంగిని ప్రేమించి ఉండడం వల్ల సారంగధర ఆ వివాహానికి అంగీకరించడు. మంత్రి గంగన్న కుయుక్తితో కత్తికి కంకణం కట్టించి, చిత్రాంగికి పెళ్ళి జరిపిస్తాడు. వేంగి రాజ్యంలో అడుగుపెట్టే వరకు చిత్రాంగి సారంగధరుడే తన పతి అనుకుంటుంది. అయితే సంధి కారణంగా గొడవలు జరగరాదని రాజరాజ నరేంద్రుడు ఆమెను భార్యగా స్వీకరించవలసి వస్తుంది. తాను ఓ వ్రతదీక్షలో ఉన్నానని చిత్రాంగి, రాజరాజ నరేంద్రుని దగ్గరకు రానీయదు. ఓ పథకం వేసి, తన అంతఃపురానికి సారంగధరను రప్పిస్తుంది. అతనిపై వలపు కురిపిస్తుంది. సారంగధర అది తప్పని వారించి వస్తాడు. చిత్రాంగి మందిరంలో సారంగధర కత్తి, పాదరక్షలు చూసిన రాజరాజ నరేంద్రుడు అతను తప్పు చేశాడని భావించి, కాళ్ళు నరకమని ఆజ్ఞ ఇస్తాడు. కానీ, నిజానిజాలు తెలుసుకున్నాక శిక్ష ఆపాలనుకుంటాడు.
అప్పటికే సారంగధరపై శిక్ష అమలు చేసి ఉంటారు. అది తెలిసిన చిత్రాంగి, రాజరాజ నరేంద్రుని నిందిస్తుంది. ఆమె ఆత్మాహుతి చేసుకుంటుంది. రాజరాజ నరేంద్రుడు తానెంత తప్పు చేశాడో తెలుసుకుంటాడు. శివుడు ఓ సాధువు రూపంలో వచ్చి, సారంగధరుని జీవింప చేస్తాడు. తాను వలచిన కనకాంగిని పెళ్ళాడి, కన్నవారి ఆశీస్సులతో వేంగి రాజ్య సింహాసనం అధిష్టిస్తాడు సారంగధర. దాంతో కథ సుఖాంతమవుతుంది. ఇప్పటికీ రాజమండ్రిలో సారంగధర దేవాలయం ఉండడం గమనార్హం!
ఇందులో యస్వీ రంగారావు, శాంతకుమారి, రాజసులోచన, రేలంగి, చలం, గుమ్మడి, మిక్కిలినేని, ముక్కామల, సురభి బాలసరస్వతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సముద్రాల సీనియర్ మాటలు, పాటలు అందించారు. ఘంటసాల స్వరకల్పన చేశారు. ఇందులోని “అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మథుడు…”, “అన్నానా భామిని…”, “ఓ చిన్నవాడ… ఒక్కసారి నన్ను చూడు…”, “ఓ రాజా… ఇటు చూడవోయి…”, “జయ జయ మంగళ గౌరీ…”, “పోయిరా మాయమ్మ…”, “మనసేమో మాటలలో దినుసేమో…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఇందులో కొన్ని పద్యాలు సైతం చోటు చేసుకున్నాయి. వి.యస్. రాఘవన్ దర్శకత్వంలో టి.నామదేవ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదట్లో అంతగా అలరించని ఈ చిత్రం తరువాత జనాదరణ చూరగొనడం విశేషం!
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!