NTV Telugu Site icon

35Movie : ’35 చిన్న కథ కాదు’ సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది : నివేతా థామస్..

Untitled Design (3)

Untitled Design (3)

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన ఫీల్ గుడ్, హోల్సమ్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ హిట్అందుకుంది.

Also Read: Devara : ఓవర్సీస్ లో దేవర దండయాత్ర.. ఆచార్య ఫుల్ రన్ అవుట్..

ఈ చిత్ర విజయం పట్ల హీరోయిన్ నివేద థామస్ మాట్లాడుతూ ఈ సినిమా అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకి, అందరికీ ధన్యవాదాలు. మేము చాలా థియేటర్స్ ని విజిట్ చేశాం. అన్నిచోట్ల సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతోంది. నిన్న ఓ సింగిల్ స్క్రీన్ కి వెళ్ళినప్పుడు థియేటర్ మొత్తం నిండిపోయి, చాలా మంది పిల్లలు స్టేజ్ వద్ద ఆడుకోవడం చూసినప్పుడు ఒక నర్సరీ స్కూల్ లో సినిమా ప్లే చేసిన గొప్ప అనుభూతిని ఇచ్చింది. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సక్సెస్ ఇక్కడ నుంచి మొదలైయింది. మేము పర్శనల్ గా వచ్చి ఆడియన్స్ కి థాంక్స్ చెబుతాం. సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అని అన్నారు. ఫ్యామిలీ ఎంటటైనర్ గా వచ్చిన ఈ సినిమాను బాలీవుడ్ సినిమా తారే జమీన్ పర్ తో పోలుస్తున్నారు నెటిజన్స్.విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతుంది 35.

Show comments