NTV Telugu Site icon

Rajinikanth: రజినీకాంత్‌కు గుడి.. పాలాభిషేకం!!

నటులు, నటీమణులు, రాజకీయ నాయకులకి దేవాలయాలు నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించి దేవుళ్లలా పూజిస్తున్నారు కొందరు. నటుడు రజనీకాంత్‌కు తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో నటుడు రజనీకాంత్ నేడు తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మదురై జిల్లా తిరుమంగళానికి చెందిన కార్తిక్ అనే మాజీ సైనికుడు రజనీకాంత్ కోసం నిర్మించిన ఆలయంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నటుడు రజనీకాంత్‌కి కార్తీక్ వీరాభిమాని. అందుకే రజనీకాంత్ కోసం ‘అరుల్మికు శ్రీ రజినీ దేవాలయం’ నిర్మించారు. అందులో నటుడు రజనీకాంత్ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. ప్రతి పుట్టినరోజున, కార్తీక్ “రజనీ చతుర్థి డిసెంబర్ 12” పేరుతో పండుగను నిర్వహిస్తాడట. ప్రస్తుతం ఆలయంలో 250 కిలోల 3 అడుగుల ఎత్తుతో నటుడు రజనీకాంత్ విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహిస్తున్నారు.

Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటా: సాయిపల్లవి

రజనీకాంత్ 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నల్లరాతితో మూడున్నర అడుగుల ఎత్తుతో 350 కిలోల బరువుతో నటుడు రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని నిన్న ఉత్సవ మూర్తిగా, పాత విగ్రహ మూలంగా ప్రతిష్టించబడింది. కొత్త విగ్రహం మాప్పిళ్లై చిత్రంలో నటుడు రజనీకాంత్ పాత్రను సూచించేలా ఉంది. ఈ విషయమై మాజీ సైనికోద్యోగి కార్తీక్ మాట్లాడుతూ.. “నేను రజనీకాంత్‌కి పెద్ద అభిమానిని. 2021 నుండి నేను రజనీ విగ్రహానికి పూజలు చేస్తున్నాను.గతేడాది అక్టోబర్ 26, 2023న 3 అడుగుల 250 కిలోల మూలవర్ రజనీకాంత్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. నిన్న ప్రతిష్టించిన విగ్రహం మూడున్నర అడుగుల పొడవు, 300 కిలోల బరువు ఉంటుంది. ఈ విగ్రహానికి 8 రకాలు అంటే పంచామృతం, బంతి, బాలు, చందనంతో అభిషేకం చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ఈ రజనీకాంత్ విగ్రహాన్ని విరుదునగర్‌కు చెందిన స్థపతి రూపొందించారు. ఇందుకు మొత్తం రూ.70 వేలు ఖర్చు చేశారు. గత 6 నెలలుగా ఈ విగ్రహాన్ని చెక్కారు.

Show comments