321 Movie : పెళ్లికి ఏది బెస్ట్.. లవ్వా? అరేంజ్డా? టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా ‘3 2 1’ మూవీ!**
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అనగానే నేటి యువతకు, వారి తల్లిదండ్రులకు మధ్య జరిగే అతిపెద్ద యుద్ధం.. ‘లవ్ మ్యారేజ్ బెస్ట్ ఆ? అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టా?’. ఎప్పటికీ తెగని ఈ గంభీరమైన చర్చను, రెండు తరాల మధ్య ఉన్న ఈ సున్నితమైన సంఘర్షణను ఇప్పుడు టాలీవుడ్ తెరపైకి అత్యంత సాహసోపేతంగా తీసుకొస్తోంది ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్) చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా కాన్సెప్ట్ ఇండస్ట్రీ వర్గాల్లోనూ, యూత్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇలాంటి ఒక బర్నింగ్ టాపిక్‌ను డీల్ చేయడం సాదాసీదా విషయం కాదు. అందుకే తన గత చిత్రాలతో ఏకంగా రెండు ప్రతిష్టాత్మక నంది అవార్డులను కొల్లగొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ చిలుముల శాంతికుమార్ ఈ సవాలును స్వీకరించారు. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వంగపాటి రామానుజ రెడ్డితో కలిసి ఆయన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బూతులు, రక్తపాతం ఉన్న సినిమాలే వస్తున్న ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ.. పక్కా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని, ఏ ఇబ్బందీ లేకుండా చూసేలా ఈ చిత్రాన్ని మలిచిన తీరు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘పారడైజ్’ సినిమాలో జూనియర్ సమ్మక్కగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన లావణ్య.. ఈ చిత్రంలో మెయిన్ లీడ్‌గా (హీరోయిన్) చేస్తోంది. వెబ్ సిరీస్‌ల ద్వారా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు తోడు ‘లవ్ vs అరేంజ్డ్’ థీమ్ యూత్‌కి విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. రీసెంట్గా రిలీజైన ట్రైలర్‌తో పాటు ‘నను తాకిన’ అనే రొమాంటిక్ మెలోడీకి సోషల్ మీడియాలో ఏకంగా మిలియన్ వ్యూస్ దాటడం ఈ సినిమాపై ఉన్న బజ్కు నిదర్శనం. వివన్ సూర్య, ప్రభావతి, అప్పాజీ అంబరీష, కుంతి శ్రీనివాస్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. జాయ్ కాల్విన్ అందించిన మ్యూజిక్, శివ ముప్పాల విజువల్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆలోచింపజేసే కథాంశంతో వస్తున్న ‘3 2 1’ చిత్రం అక్టోబరు 23న థియేటర్లలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. మరి లవ్ మ్యారేజ్ గెలుస్తుందా? అరేంజ్డ్ మ్యారేజ్ గెలుస్తుందా? ఈ సినిమాలో దర్శకుడు ఇచ్చిన సెన్సేషనల్ కంక్లూజన్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లలోకి వెళ్లి ఈ సినిమా చూడాల్సిందే!
Also Read
తాజావార్తలు
-
Chiranjeevi : కాక తర్వాత చిరు నెక్స్ట్ ఎవరితో?
-
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Telangana El Nino : ఎల్‌నినో ముప్పు.. రంగంలోకి కేబినెట్ సబ్ కమిటీ.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!