నటుడు అర్జున్ సర్జా చెన్నైలో హనుమాన్ ఆలయాన్ని ఇటీవల నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఆలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. వేద పండితుల నడుమ ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంజనేయస్వామికి పరమ భక్తుడైన అర్జున్ చెన్నై విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన సొంత స్థలంలో అర్జున్ ఈ ఆలయాన్ని అద్భుతంగా నెలకొల్పారు. ఆలయం ప్రారంభోత్సవం కావడంతో భక్తులు భారీగా వచ్చి దర్శించుకున్నారు.
హనుమాన్ ఆలయ ప్రారంభోత్సవంలో అర్జున్
