జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది.
Also Read : Golden Year : ఆ స్టార్ హీరోకు ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే
కాగా దేవర సినిమా రిలీజ్ అయి నేటికీ సరిగ్గా ఏడాది. ఈ సందర్భంగా #1YearForDevaraThandavam హ్యాష్ ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఈ సినిమా సాధించిన వసూళ్లు ఓ రికార్డ్ అనే చెప్పాలి. తోలి రోజు భారీ నెగిటివిటి. ఓవర్సీస్ రివ్యూలు సైతం అంత గొప్పగా ఏమి రాలేదు. తెలుగు స్టేట్స్ లోను రివ్యూస్ కాస్త మిక్డ్స్ గానే వచ్చాయి. కానీ వీటన్నిటిని కూడా దాటి భారీ హిట్ కొట్టింది దేవర. ఎన్టీఆర్ నటన, డాన్స్, క్రేజ్ దేవరను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపింది. RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా రాజమౌళితో సినిమా చేసాక ఏ హీరోకైనా ప్లాప్ వస్తుందనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది. ఇన్ని సంచలనాలు సృష్టించిన దేవరకు సీక్వెల్ కూడా ఉంది. అయితే ఎన్టీఆర్ కు వేరే ఇతర సినిమాల కమిట్మెంట్ వలన దేవర 2 షూటింగ్ డిలే అవుతోంది.. మరి దేవర సీక్వెల్ ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువెళ్తారో చూడాలి.
