Site icon NTV Telugu

`ఆహా` వీక్ష‌కుల‌కు ఇవాళ పండ‌గే పండ‌గ‌!

15 Movies to premiere on Aha this Friday

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ శుక్ర‌వారం త‌న వీక్ష‌కుల‌కు ఊహించ‌ని బ‌హుమ‌తుల‌ను అందించింది. ఈ శుక్ర‌వారం మీకు ప‌దిహేను చిత్రాలు ఇస్తున్నాం... లైఫ్‌లో ఎంట‌ర్ టైన్ మెంట్ ఉండాలి క‌దా అంటూ సోష‌ల్ మీడియాలో ఆ సినిమాల జాబితాను ప్ర‌క‌టించింది. విశేషం ఏమంటే… ఆ జాబితాలో ప‌దిహేను కాదు… పద‌హారు చిత్రాలు ఉన్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన బంగారు బుల్లోడు, భైర‌వ ద్వీపంతో పాటుగా, రాజేంద్ర ప్ర‌సాద్ కొబ్బ‌రి బొండాం, రాజేంద్రుడు - గ‌జేంద్రుడు, నాని ఈగ‌, శ్రీకాంత్ వినోదం, రాజశేఖ‌ర్ వేట‌గాడు, అలీ ఘ‌టోత్క‌చుడు, నాగ‌చైత‌న్య యుద్ధం శ‌ర‌ణం, న‌వీన్ చంద్ర అందాల రాక్ష‌సి, నాగ‌శౌర్య ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య‌, వేణు చిరున‌వ్వుతో, అంజ‌లి లీసా ఇలా మొత్తం 14 చిత్రాల‌ను ఆహాలో శుక్ర‌వారం స్ట్రీమింగ్ చేసింది.

Read Also : “జస్టిస్ ఫర్ బ్రూనో”… స్టార్స్ ఆగ్రహం

దీనికి అద‌నంగా ఈ శుక్ర‌వార‌మే యాంక‌ర్ ప్ర‌దీప్ హీరోగా న‌టించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?, క‌న్న‌డ అనువాద చిత్రం పొగ‌రును వీక్ష‌కుల కోసం అందించింది. పాత కొత్త సినిమాలను క‌ల‌గ‌లుపుతూ ఒకే రోజు 16 సినిమాల‌ను స్ట్రీమింగ్ చేయ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. సో… మ‌రి కొద్దిరోజుల పాటు థియేట‌ర్లు తెరుచుకోక‌పోయినా… సినీ అభిమానుల‌కు ఆ లోటు తెలియ‌కుండా ఆహా చేసింది.

Exit mobile version