NTV Telugu Site icon

సిద్ శ్రీరామ్ “అయ్యయ్యయ్యో” సాంగ్ కు 1 మిలియన్ వ్యూస్

1 Million Views for the Melodious Ayyayyayyo Song from AakasaVeedhullo

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. హీరోగా నటిస్తున్న గౌతమ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రచయితగా కూడా పని చేస్తున్నారు. జికే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై మనోజ్, డి.జె. మణికంఠ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జుడా సంధి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ‘ఆకాశ వీధుల్లో’ చిత్రం నుంచి విడుదలైన “అయ్యయ్యయ్యో’ లిరికల్ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. తాజాగా ఈ సాంగ్ 1 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. ఈ రొమాంటిక్ సాంగ్ ను సిద్ శ్రీరామ్ ఆలపించగా, గౌతమ్ కృష్ణ, రికెందు మౌళి లిరిక్స్ అందించారు. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన హిట్ సాంగ్స్ లో ఇది కూడా ఒకటి అవుతుంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.