Site icon NTV Telugu

విషమంగానే కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి!

సినీ విశ్లేషకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మొదట స్వల్పగాయాలు అయ్యాయని సమాచారం అందగా.. ఫోటోలు వైరల్ కావడంతో తీవ్రంగానే గాయపడ్డట్లు తెలిసింది. కత్తి మహేశ్‌ తల, కంటి భాగాలకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో వెంటిలేటర్‌పై పెట్టామన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఆయనకు ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత కూడా ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా వున్నట్లుగా వైద్యులు కుటుంబసభ్యులకు వివరించినట్లుగా తెలుస్తోంది.

Exit mobile version