ఇప్పటి వరకూ వెండితెరపై పోటీ పడిన స్టార్స్ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీపై మక్కువ కనబరుస్తున్నారు. వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ లలో నటించడానికి అగ్రశ్రేణి తారలు ఆసక్తి చూపిస్తుండటంతో ఓటిటి ప్లాట్‌ఫాంల పరిధి కూడా పెరిగిపోతోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారమయ్యే తాజా కంటెంట్, వైవిధ్యమైన కథలు ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం నాగ చైతన్య అక్కినేని త్వరలో తన డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన భార్య సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’తో ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీకి కూడా రంగం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ తో చై ఒప్పందం కుదుర్చుకున్నాడట. అయితే చైతన్య హిందీ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారా ? లేక తెలుగు వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇటీవల నాగార్జున కూడా ఓటిటి కంటెంట్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. అయితే నాగార్జున కంటే ముందే చై డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ…!
