NTV Telugu Site icon

చిన్నారికి హార్ట్ ప్రాబ్లమ్… హెల్ప్ కావాలంటూ సుధీర్ బాబు రిక్వెస్ట్

Samskruthi is suffering from Heart Defect Please Support says Sudheer Babu

యంగ్ హీరో సుధీర్ బాబు ఎమర్జెన్సీ అంటూ ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. “ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు అందిస్తున్నాను. కాని ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి” అంటూ ట్వీట్ చేశారు. హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆ చిన్నారిని కాపాడడానికి ఎవరన్నా ముందుకు వస్తారేమో చూడాలి మరి. ఇక సుధీర్ బాబు విషయానికొస్తే… ప్రస్తుతం ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ యంగ్ హీరో. ఈ చిత్రంలో లైటింగ్ బాయ్ అనే వినూత్నమైన పాత్రలో కనిపించనున్నాడు సుధీర్ బాబు.