NTV Telugu Site icon

కరోనాతో బాలీవుడ్ నటుడు బిక్రమ్‌జీత్ కన్నుమూత

Actor Bikramjeet Kanwarpal passes away due to COVID-19 complications

కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్ కరోనాకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. 2003 లో భారత సైన్యం నుండి రిటైర్ అయిన తరువాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. పలు సినిమాలు, ఓటిటి, టీవీ షోలలో నటించాడు బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్. ‘పేజ్ 3’, ‘ఆరాక్షన్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పయో’, ‘జబ్ తక్ హై జాన్’, ‘2 స్టేట్స్’ సహా పలు విజయవంతమైన చిత్రాలలో ఆయన భాగమయ్యారు. అతని చివరి చిత్రం రానా దగ్గుబాటి మరియు తాప్సీ పన్నూ నటించిన ‘ది ఘాజి ఎటాక్’. తాజాగా ఈ సీనియర్ నటుడు కోవిడ్ -19 సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.