తమిళ చిత్రసీమలో సూర్య నటించిన ‘గజిని’కీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అక్కడే కాదు తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఇక్కడా సూపర్ హిట్ అయ్యింది. విశేషం ఏమంటే… ‘గజిని’ చిత్రాన్ని అల్లు అరవింద్ మిత్రులతో కలిసి ఆమీర్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్ చేసి అక్కడా సూపర్ హిట్ ను అందుకున్నారు. అందుకే అల్లు అరవింద్ కు సైతం ‘గజిని’ ఓ స్పెషల్ మూవీ. ఇంతకూ విషయం ఏమంటే… తమిళ దర్శకుడు మురుగదాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘దర్బార్’ మూవీ చేసిన తర్వాత మరే చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. ఇంతకాలం అతను ‘గజిని -2’ కథను తయారు చేసుకోవడం మీదే దృష్టి పెట్టాడట. దానిని పాన్ ఇండియా మూవీగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కించబోతున్నాడని, అల్లు అరవింద్ దీన్ని నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ ఇటు కొరటాల శివతోనూ, అటు ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తోనూ సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు కానీ వారిద్దరూ వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సో… మురుగదాస్ మూవీ ‘గజిని-2’ని బన్నీ ‘పుష్ప’ తర్వాత పట్టాలెక్కించినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది ఫిల్మ్ నగర్ టాక్!
ఐకాన్ స్టార్ తో మురుగదాస్ ‘గజినీ’ సీక్వెల్!
