NTV Telugu Site icon

‘ఆర్ఆర్ఆర్’ ఉగాది స్పెషల్ పోస్టర్… సంబరాల్లో భీం, సీతారామరాజు…!

Ugadi Special Poster from RRR Released by NTR

దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’`. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా… చరణ్ కు జోడిగా అలియా ‘సీత’ పాత్రలో నటిస్తోంది. ఇక కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా… ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్టర్ ను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో కొమురం భీం, సీతారామరాజు సంబరాల్లో పాల్గొంటున్నట్టుగా అన్పిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2021 అక్టోబర్‌ 13న రిలీజ్‌ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులకు సినిమాను సినిమాను త్వరగా చూడాలన్న ఆతృతను పెంచేశాయి. అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, శ్రియ శరన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు సంగీత సారథ్యం వహిస్తున్నారు.