NTV Telugu Site icon

Poonam Pandey Alive: మనోభావాలు దెబ్బతిన్నాయ్ .. పూనమ్ పాండేపై కేసు పెట్టండి!

Poonam Pandey

Poonam Pandey

Cine Workers Union Demands FIR Against Poonam Pandey For Cervical Cancer Death Fake Post: వివాదాస్పద నటిగా ముందు నుంచి ఫేమస్ అయిన పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించినట్లు నిన్న ఉదయం ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చావు విషయంలో ఎవరు నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు కాబట్టి ఆమె చనిపోయిందని కొందరు నమ్మితే ఆమె గత చరిత్రను బట్టి ఏదైనా ప్రాంక్ చేస్తుందేమోనని కొందరు భావించారు. ఈ ప్రచారాలన్నింటికీ బ్రేక్ వేస్తూ ఈ ఉదయం తాను బతికే ఉన్నానని గర్భాశయ క్యాన్సర్ గురించి జనాల్లో అవగాహన తీసుకురావడం కోసమే చనిపోయినట్లు ప్రకటించానని చెబుతూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.

Upasana: చిరుకి పద్మ విభూషణ్.. సినీ ప్రముఖులకి ఉపాసన పార్టీ

అదేమిటంటే తాను చనిపోయానని తన మేనేజర్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయించిన పూనం పాండే, ఆమె చెప్పగానే అందులో పోస్ట్ చేసిన మేనేజర్, ఈ ఇద్దరి మీద కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో నటి పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించారని ఫేక్ వార్త ఇండియన్ సినీ పరిశ్రమలో ఉన్న అందరిని ఆందోళనకు గురి చేసింది. పబ్లిసిటీ కోసమే ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశానని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ ఫేక్ న్యూస్ నమ్మి ఆమె మరణానికి నివాళులు అర్పించిన వారందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆమె మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఆమె మీద, ఆమె మేనేజర్ మీద కేసు నమోదు చేసి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Show comments